Category Archives: సినిమాలు

మంత్రగత్తెలో మాతృత్వం

సాధారణం

దాదాపు పదహారేళ్ళ కింద మా ఇంటిల్లిపాదికీ చిన్నపిల్లల సినిమాలూ, అనిమేటెడ్ సినిమాలూ అలవాటయ్యాయి. ఆ అలవాటునించి పిల్లలు పెద్దయి బయటపడ్డా మేమిద్దరం చాలా పిల్లల సినిమాలు చూస్తూనే వుంటాం. పిల్లల సినిమాలూ- అనిమేటెడ్ సినిమాల ధర్మమా అని మాకు ఫెయిరీ టేల్స్ అన్నీ బాగా తెలిసిపోయాయి.

Read the rest of this entry

ప్రకటనలు

బంగారానికి మెరుగు

సాధారణం

ఎంత అందమైన బంగారు నగైనా మెరుగు పెడితేనే మెరుపొచ్చేది. ఎంత విలువైన వజ్రానికైనా సాన పెడితేనే ప్రకాశించేది. ఎంత అద్భుతమైన కళాకారుడైనా చెమటోడ్చి సాధన  చేస్తేనే కళావిష్కరణ జరిగేది.

Read the rest of this entry

అరవ సినిమా అందాలు

సాధారణం

మన పక్కింటివాళ్ళ పిల్లలు గోల్డు మెడళ్ళూ అవార్డులూ కొట్టేస్తూ చదువులో మెట్లెక్కుతున్నారనుకోండి, సంతోషిస్తాం, అభినందిస్తాం. మన పిల్లలు అంత కాకపోయినా, ఏదో కొంచెం పర్వాలేదన్నట్టు చదువుతుంటే, మనసు కొంచెం మూల్గినా, పోనీలే, ఎవరి ప్రతిభ వారిదే అని సరి పెట్టుకుంటాం. కానీ, మన పిల్లలు ఒక్కొక్క పరీక్షా అయిదేసి సార్లు రాస్తూ, పదో తరగతి గట్టెక్కడానికి తంటాలు పడుతూంటే? ఏడుపొస్తుంది, కదూ? మన పిల్లల చదువు గురించి ఒక బాధైతే, పక్క వాళ్ళ పిల్లలని చూసి ఏడుపు రెండోది. కాదని అనగలరా?

Read the rest of this entry

లెక్కల గది

సాధారణం

అన్ని వైఙ్ఞానిక శాస్త్రాల్లోనూ గణితం మహా రాణి వంటిది” అన్నాడు గణిత శాస్త్రఙ్ఞుడు కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ (1777-1855). ఎవరితోనూ సంబంధం లేకుండా ఫిజిక్సూ, కెమిస్ట్రీ, బయాలజీ లాటి అన్ని సైన్సుల భాగ్యాలనీ శాసిస్తూ టీవిగా దర్పంగా నిలబడి వున్న మహారాణి గుర్తొస్తుంది, మేథమేటిక్స్ ని తలచుకుంటే. Read the rest of this entry

నేనూ-తెలుగు సినిమా

సాధారణం

అందరూ ఒకటే తెలుగు సినిమా రివ్యూలు రాసేస్తున్నారు. నేనేమో థియేటర్లో తెలుగు సినిమా చూసి దాదాపు అయిదేళ్ళవుతుంది. ఆఖర్న నేను చూసింది “గోదావరి” అనుకుంటా. ఆ తర్వాత “గమ్యం” సినిమా డీవీడీలో చూడటంతో నా తెలుగు సినిమా ప్రస్థానం ఆగిపోయింది.

తెలుగు సినిమా హీరోయిన్ల దుర్భర దారిద్ర్యం తీరిపోయి వాళ్ళకి ఒంటి నిండా బట్టలిచ్చే నాధుడు (నిర్మాత?) దొరికేవరకూ నేను తెలుగు సినిమాలు చూడనని ఒట్టేసుకోవకటం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది.

ఇప్పుడంటే ఇలా తెలుగు సినిమాలూ నేనూ ఎడ మొహం-పెడ మొహం అయ్యాం కానీ, చిన్నప్పుడు నాకు సినిమాలంటే భలే ఇష్టంగా వుండేది.

గుండ్రాలు తిరిగి నా బాల్యంలోకెళ్తే నాకుండే ఙ్ఞాపకాలు, చాలా సినిమాలతోనే ముడి పడి వున్నాయి. అన్నిటికంటే మిక్కిలి బాధాకరమైనది ఇంట్లో అంతా మమ్మల్ని (అంటే చిన్న పిల్లలని) వదిలేసి సెకండ్ షో సినిమాకెళ్ళటం! ఈ అరాచకం ఎక్కువగా సెలవుల్లో అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు జరిగేది. హైదరాబాదు లో వున్నప్పుడు తనతో పాటు నన్నూ సినిమాకి తీసికెళ్ళే అమ్మ పుట్టిల్లు చేరగానే నన్ను మిగతా పిల్లల్తో వదిలి తన పరివారంతో సినిమాకెళ్ళేది. నేనేం చిన్నదాన్నా, చితకదాన్నా? అప్పటికే అయిదేళ్ళొచ్చేసాయి. తెలుగు హిందీ సినిమాలు చక్కగా అర్ధం అయ్యేవి కూడా! అలాటి సమయాల్లో అసలు బ్రతుకు మీదే ఒకలాటి విరక్తి కలిగేది.

అలాటి ఙ్ఞాపకాల్లో ఇప్పటికీ రక్తం కారే గాయం “భక్త తుకారాం” సినిమా విషయం లో జరిగింది. ఆ సినిమాకి అమ్మ నన్ను ఇంట్లో నాన్నగారి దగ్గరొదిలేసి తనొక్కతీ అత్తయ్యతో కలిసి వెళ్ళి చూసింది! నన్ను తిసికెళ్ళకపోవటమే కాదు, రెండేళ్ళ మా చెల్లిని తీసికెళ్ళింది. నా మనసు అవమానంతో భగ్గుమంది! నాకంటే అమ్మకి చెల్లి మీదే ప్రేమ ఎక్కువేమో అన్న ఆలోచనతో తిరగబడాలనుకున్నాను. అయితే మనకి కొంచెం ప్రభుత్వంలో “ఇంఫ్లుయెన్సు” వుండటం మంచిదన్న దూరాలోచనతో నాన్న దగ్గర చేరాను.

రాత్రి నాకు అన్నం తినిపించి పక్కనే పడుకోబెట్టుకున్నారు నాన్న. ఆయన చెప్పే కథలు వింటూ మెల్లగా నాకు జరిగిన అన్యాయం గురించి ప్రస్తావన తెచ్చాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు, అమ్మ అసలు మంచిది కాదని! దాంతో అమ్మకి తగిన శిక్ష వేయాలని నిర్ణయించాను. నాకు బాగా నిద్రొస్తుంది కాబట్టి, అమ్మ వచ్చేంత వరకూ మేలుకుని వుండలేను. అందువల్ల అమ్మ సినిమా నించి ఇంటికొచ్చినప్పుడు తలుపు తెరవొద్దని తీర్పు చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు. రాత్రంతా బయట వాకిట్లోనే నిలబడే అమ్మా- చెల్లాయిల గురించి శాడిస్టిక్ కలలు కంటూ నిద్ర పోయాను.

మర్నాడు అమ్మ మంచం మీద నన్ను ముద్దు పెట్టుకుంటుంటే లేచి ఇంకా ముద్దులు పెట్టుకోమని రెండో చెంప అందించబోయి……
 కెవ్వుమన్నాను! అమ్మ లోపలికెలా వొచ్చింది. అసలు నాన్న, ఆ ద్రోహి ఎక్కడా? ఆయనెప్పుడూ అమ్మ పార్టీయేలే అనుకుంటూ లోపలికి పరిగెత్తి అడిగాను “నాన్నా! అమ్మ లోపలికెలా వొచ్చింది?” అని.

మా నాన్న జాలిగా మొహం పెట్టి, “అసలు ఎంత బతిలాడినా లోపలికి రానివ్వలేదు నాన్నా! కానీ బాగా చీకటయ్యి అమ్మా- చెల్లీ బాగా బయపడ్డారు. ఇంకోసారెప్పుడూ నిన్ను వదిలిపెట్టి సినిమాకెళ్ళోద్దని బాగా తిట్టానిద్దర్నీ” అన్నారు. ఇంకేం చేస్తాం. సరే పోనిలే అని వెళ్ళి మంచం మీద అమ్మతో మిగతా ముద్దులు పెట్టించుకున్నా!

అంత రాక్షసంగా నా మనసుని ముక్కలు చేసింది తెలుగు సినిమా! ఆ తర్వాత అమ్మనొదిలి స్నేహితులతో నేనూ చాలా సార్లు సినిమాకెళ్ళి పగ తీర్చుకున్నా అనుకోండి, అది వేరే సంగతి.

దాదాపు 1990 వరకు నేను బాగానే తెలుగు సినిమాలు చూసేదాన్ని. హైదరాబాదు వదిలేయటం వల్ల కొంతా, వాటి క్వాలిటీ రోజు రోజుకీ పాతాళంలోకి ప్రయాణిస్తుండటంవల్ల కొంతా సినిమాలు తగ్గిపోయాయి.

ఇప్పుడైతే తెలుగు సినిమా ప్రకటనలకి జడుసుకోని నేను మా ఇంట్లో తెలుగు టీవీ చానెల్సు కూడా పెట్టించనివ్వను!
“ఇంద్ర”, “పోకిరీ”, “కిక్”, “ఇడియెట్” “అరుంధతి” ల నించీ, “దూకుడు”,”పాకుడు”,”మొగుడు” “ఉసరవెల్లి” “పెంపుడు బల్లి” ఎన్ని సినిమాలు, ఎలాటి సినిమాలొచ్చినా నాకు భయం లేదు.

కిందటి సారి హైదరాబాదులో వుండగా నాన్న “ఇంట్లో బోరు కొడితే అలా సినిమాకెళ్ళొస్తారా నువ్వూ అమ్మా పిల్లలూ?” (మా ఇంటి పక్కనే థియేటర్ వుంది లెండి!)
“హమ్మో! సినిమానా? వొద్దులే!” అన్నాను.

నెల రోజుల కింద మా మధు అదేదో సినిమాలో తమన్నా పాటేదో చూసిందట స్నేహితులింట్లో. నాతో నవ్వుతూ చెప్పింది, “అమ్మా! ఇక నువ్వు తెలుగు సినిమా హీరోయిన్లు స్కింపీ బట్టలేసుకుంటున్నారని  బాధ పడే పనిలేదు” అని. “ఎందుకే” అంటే, “ఇందాక ఒక పాటలో హీరోయిను అసలు బట్టలే వేసుకోలేదు,” అని నవ్వింది

What ever happened to Baby Jane అను అక్కా చెల్లెళ్ళ కథ

సాధారణం

నాకు మా వూళ్ళో అన్నిటికంటే నచ్చేది లైబ్రరీ! అక్కడ దొరికే పాత సినిమా వీడియోలు! అన్నీ తీరిగ్గా వెతుక్కుని భాషా భేదం లేకుండా చూసి ఆనందిస్తాను. అందులో లైబ్రరీలకి పైసా కూడా చెల్లించక్కర్లేదు!

Read the rest of this entry