వికటించిన హాస్యం

సాధారణం

హాస్యం చాలా సున్నితంగా వుండాలన్న విషయం అందరికీ తెలిసిందే. మాటలతో నైనా, చేతలతోనైనా ఎవరినైనా వుడికిస్తే, ఆ తర్వాత ఆ సంగతి ఎప్పుడు తలచుకున్నా నవ్వు రావాలి. “అతి సర్వత్ర వర్జయేత్” అన్న సూక్తి హాస్యానికి వర్తించినంతగా ఎక్కడా వర్తించదేమో.

మధ్య నే జరిగిన నర్సు జసింతా సల్దానా విషాద ఉదంతం వింటే ఇదే అర్ధమవుతుంది. ప్రపంచమంతటా మీడియా చేసే అతి వికృత రూపాలు దాలుస్తుందేమో అన్న అనుమానం రాక మానదు ఉదంతాన్ని పరిశీలిస్తే. ఇంతకీ జరిగిందేమీటంటే

అసలే ఆస్ట్రేలియన్లకి రాణి గారన్నా, ఆవిడ పరివారమన్నా మహా మోజు. ఇంగ్లండులో కూడా Queen’s birthday అనే సెలవుండదు, కానీ ఆస్ట్రేలియాలో మాత్రం వుంటుంది. అలాటిది ఇహ ఏకంగా రాణీ గారి మనవరాలి వేవిళ్ళ సంగతి గురించి అడగాలా. అబ్బో, హంగామా, వార్తలూ, వ్యాఖ్యలూ, పులకరించిపోవడాలూ, చెప్పలేని ఓవరాక్షనూ! అసలే మీడియా, దానికి తోరుగు రాచరికపు గర్భం. ఇహ చూడండి, ఆస్ట్రేలియాలో మీడియా రెచ్చిపోయింది. “డచెస్ఆఫ్ కేంబ్రిడ్ద్జీ, మరియూ ప్రిన్స్ విలియం ముద్దుల భార్యా అయిన కేట్ వచ్చే తొమ్మిది నెలల్లో వేసుకోబోయే గౌన్ల దగ్గర్నించి, ఆవిడ మంచి తల్లి కాగలదా అనే విషయం వరకూ పేపర్లు హోరెత్తిస్తున్నాయి. మేమూ ఏం తక్కువ లేదనుకుంటూ రేడియో కూడా రంగంలోకి దిగింది.

నెల మూడో తారీఖున యువరాణి కేట్ కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్ లో డీహైడ్రేషన్ తో చేరారు. మర్నాడు ఆస్టేరియో అనే మీడియా సంస్థ అధీనంలో వుండి, సిడ్నీనించిప్రసారమయ్యే టుడే ఏఫ్ ఏం (2DayFM) అనేరేడియో చానెల్లో వచ్చే బ్రేక్ ఫాస్ట్ షో జాకీలు మెల్ గ్రెగ్, మైకెల్ క్రిస్టియన్ ఆస్పత్రి కి ఫోన్ చేసారు.                రేడియోజాకీలుమామూలుమనుషులనిటెలిఫోనులోపిలిచిరకరకాలుగాఏడ్పించడంఎప్పణ్ణించోవున్నదే. ఇదీఅలాటిఅల్లరిఫోన్కాలే. అన్నట్టుమెల్గ్రెగ్దిమావూరే, అడిలైడ్!

వీలైనంతగా ఇంగ్లీషువారి యాస ననుకరిస్తూ అస్పత్రిలో ఫోనెత్తిన నర్సు జసింతాతో, క్వీన్ ఎలిజబెత్ నిమెల్గ్రెగ్, అటుపిమ్మట ప్రిన్స్ చార్లెస్ నిమైకెలూ అనుకరిస్తూ యువరాణీ గారి ఆరోగ్యం గురించి వాకబు చేసారు. పాపం అమాయకురాలు వారి ఫోన్ ని ఆస్పత్రిలోని వార్డులొకి ఇచ్చింది. అక్కడ నర్సు ఇంకా అమాయకంగా ఫోన్లో అమ్మాయిగారి పరిస్థితి పూస గుచ్చినట్టు చెప్పింది.

ఇద్దరూపొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, సంభాషణంతారికార్డు చేసి ప్రసారం చేసే ముందు పై అధికారులకి పంపారు. అప్పటివరకూ ఇది రేడియో జాకీలు చేసే మామూలు అల్లరే, కొంచెంశృతి మించినట్టుగా అనిపించింది.

కానీ, సంభాషణని ప్రసారం చేసే ముందు ఇంగ్లండులోని కింగ్ ఎడ్వర్డు ఆస్పత్రి అనుమతీ, రాణీగారిపరివారం అనుమతీ ఏదీ తీసుకోకుండా, ప్రోటోకాల్స్అన్నీ బేఖాతరు చేసి రేడియో ఈ సంభాషణని ప్రసారం చేసింది. తర్వాత రెండు రోజులకి నర్సు జసింతా సల్దానాహాస్పిటల్స్టాఫ్ గదిలో చచ్చిపోయి పడి వుంది. ఇద్దరుపిల్లలతల్లిఆత్మహత్యచేసుకుంది. వెంటనేఇద్దరు జాకీల షోను రద్దు చేయటమూ, వాళ్ళఉద్యోగాలు ఊడటమూ, 2DayFM సొంతదారు ఆస్టేరియో కీ ఆస్పత్రికీ మధ్య మాటల యుధ్ధాలూ, దుమ్మెత్తిపోసుకోవటాలూ, సందట్లోసడేమియా అని సోషల్ నెట్ వర్క్ గ్రూపులు జాకీల మీద కారాలూ మిరియాలూ నూరడాలూ, అన్నీమామూలే. బకింగ్హాంపాలెస్నించిదీనిగురించిఇంతవరకూఎటువంటివ్యాఖ్యానమూ, వివరణారాలేదు.

అసలుఈ విషాదం లో తప్పెవరిది? బాధితులెవరు? అంటేఏమో అర్ధం కావడం లేదు. ఇప్పుడుఆ రేడియో జాకీలనిసంస్కారంతెలియని హీనులు“, “రక్తంతో మీ చేతులు తడిసాయి,” అనితిడుతున్న వాళ్ళే , ఇంకొకరోజు అంతకంటే చెత్త ప్రాక్టికల్ జోకుకి పడీ పడీ నవ్వుతూ రేటింగులు పెంచేస్తారు. రేటింగుల కోసం మళ్ళీ, మళ్ళీతమ హద్దులు మర్చిపోతారు రేడియో జాకీలు. ఇదేసంస్థ వారిఇంకొకరేడియోజాకీకైల్ సాండిలాండ్స్ ఇలాటి వివాదాలకు పెట్టింది పేరు. పదహారేళ్ళఅమ్మాయిని అసభ్యమైన ప్రశ్నలు వేసి వేధించాడని అతని మీద వేటు పడింది.

చిన్నపిల్లలముద్దు మాటలూ, అల్లరిచేష్టలూ చూసి మనం నవ్వినప్పుడు వాళ్ళు అవి ఇంకా ఎక్కువ చేస్తారు. అదిఎక్కడ ఆపాలో వాళ్ళకి అర్ధం కాదు, తెలియదూ! ఎక్కడోఒక దగ్గర పెద్దలకి కోపం రాగానే మొహం చిన్న బుచ్చుకుంటారు. మీడియాఆంకర్లదీ అదే తంతేమో. హాస్యానికీ, అసభ్యతకీమధ్య వున్న సన్నని గీత ప్రేక్షకుల హర్ష ధ్వానాల మధ్య వాళ్ళకి కనబడదు. హద్దుదాటింతర్వాతగానీతెలియదు. అప్పటికేజరగాల్సినహానిజరిగిపోతుంది.

తప్పెవరిదైనా, మూడుజీవితాలు అన్యాయంగా పాడైపోయాయి. నిన్నరాత్రి మెల్, మైకెల్ఇద్దరూ కన్నీళ్ళతో, ఇలాజరుగుతుందని మేమేమాత్రమూఊహించలేదని చెప్పారు.

అసలుమమ్మల్నెవ్వరూ నమ్మరు, ఎవరోఫోన్ పెట్టేస్తారనుకున్నాము కానీ, ఇంతవరకూవొస్తుందనుకోలేదు,” అన్నారిద్దరూ. ఏదిఏమైనాప్రపంచమంతటామీడియా, సామాన్యప్రజలజీవితిల్లోకిఎంతవరకుచొచ్చుకొనిరావటంమంచిదిఅన్నవిషయంమీదసరైనఅవగాహనా. కొంచెంస్వయంనియంత్రణాఅలవర్చుకోకతప్పదు.

ప్రకటనలు

One response »

  1. రేడియో జాకీలు చేసిన పనికన్నా నర్సు చనిపోయి కనిపించడం చాలా బాధాకరమైన విషయం . దానికి కారణం రేడియో జాకీలా? కాదు.

    రాణీ గారి పరివారం ఇంగ్లాండ్ లో చాలా మామూలుగా జనం మధ్యకి వచ్చేస్తారు . మరి చిన్న ప్రాక్టికల్ జోక్ ని జీర్నిన్చుకోలేకపోయారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s