నీలాంబరి

యత్ర నార్యస్తు పూజ్యంతే

Posted by: sbmurali2007 on: అక్టోబర్ 21, 2009

నా ఈ  కథను గురించి నాకు భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ముగ్గురు సంపాదకులు బాలేదనుకుంటే, ఇద్దరు ప్రముఖ రచయితలు చాలా బాగుందన్నారు. మిగతా  వాళ్ళేమంటారో నన్న కుతూహలంతో కథనూ, కథలో నా ఆలోచనలనూ పంచుకుంటున్నాను.
-శారద

యత్ర నార్యస్తు పూజ్యంతే

4 స్పందనలు కు "యత్ర నార్యస్తు పూజ్యంతే"

చిన్న విషయాలు చిలికి చిలికి ఎలా వివాదాలు సృష్టిస్తాయో బాగా చెప్పారు.

అయితే నాకు కన్విన్సింగ్ గా అనిపించని కొన్ని విషయాలు:

1. స్నేహితుల మధ్య ఏ మాత్రం బేదాభిప్రాయలున్నా, వారు ఎక్కువ కాలం స్నేహాన్ని కొనసాగించలేరు. అటువంటిది, అంత భిన్న వ్యక్తిత్వాలతో ఎల్.కె.జి నుంచి కాలేజీ దాకా వాళ్ళు స్నేహం కొనసాగించారంటే కన్విన్సింగ్ గా లేదు.

2. గొడవ టి.వి. చానల్స్ వరకు వెళ్ళటం కన్విన్స్ చెయ్యలేకపోతే, వాళ్ళిద్దరూ అంతే త్వరగా అపోహలు తొలగించుకోవటం కూడా కన్విన్సింగ్ గా లేదు.

3. బయట ఆడవాళ్ళని ఎంత వక్రబుధ్ధితో చూసినా స్నేహితులలా తల్లుల గురించి మాట్లాడుకోరు. ఒకవేళ ఖర్మ కొద్దీ అలాంటి అప్రాచ్యులున్నా, వారిని కధల ద్వారా పరిచయం చెయ్యటం సమాజంలో లేనివి(లేక కొద్ది శాతం ఉన్నవి) చూపి భయపెట్టటమేమో అనిపించింది.

మీ కధ బావుంది.

On a diffrent note, I am curious to know : స్నేహితుల మధ్య తల్లుల గురించి అలాంటి ప్రస్తావన రావటం మీరు వాస్తవంగా ఎప్పుడన్నా చూశారా/విన్నారా లేక అది మీ కధ కొసం ఊహాజనితమా?

రేరాజ్ గారూ,
కథ చదివినందుకూ, మీ అభిప్రాయం చెప్పినందుకూ ధన్యవాదాలు.
దురదృష్టవశాత్తూ, ఈ కథలో జరిగిన ప్రతి సంభాషణా నేను విన్నదే (మగపిల్లలు వాళ్ళ తల్లుల గురించీ-గర్ల్ ఫ్రెండ్స్ గురించీ చేసిన అసభ్య వ్యాఖ్యలతో సహా). తేడా అల్లా, నా కథలో మగపిల్లలు 19-21 ఏళ్ళ మధ్య వుంటే, నిజంగా ఈ సంభాషణాలో పాలు పంచుకున్న కుర్రాళ్ళు పాతికేళ్ళ మగ వాళ్ళు. వాళ్ళకెవరికీ తెలుగు చదవటం రాదు లెండి:) ఆ ధైర్యంతోనే రాసాను! నేను కథలో చెప్పినట్టు వాళ్ళందరూ చిన్నప్పటినించీ కలిసి మెలిసి పెరిగారు (నా కళ్ళముందే :( ).

Unfortunately I cannot give a proof. Trust me, when I say that by a strange quirk of fate I happened to be an accidental recipient of emails circulated among a bunch of boys.

నాకు ఆండ్ర్యూ సిమాండ్స్- హర్ భజన్ సింగ్ వివాదం లో కూడా ఇదే కనిపించింది.
నేను “మంకీ” అనలేదు, “మాకీ..” అనే బూతు మాట అన్నాను అని సింగ్ అనగానే అప్పటి దాకా వీచిన రేసిస్టు దుమారం ఆగిపోయింది. ఒక్కళ్ళకైనా అమ్మని ఉద్దేశించి బూతు మాట అనటం తప్ఫే అని అనిపించలేదెందుకో.

బృహస్పతి గారూ,
తరచి చూసుకోండి. మీ స్నేహితుల్లో మీతో ఏకీభవించని వారూ, మీ అభిప్రాయాలని పట్టించుకోకుండా వుండే వాళ్ళు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులని చూడండి. వాళ్ళు మీకెంత చిరాకు పుట్టించినా వాళ్ళ మీద అభిమానం పోదు.
అరుణ గారూ,
ధన్య వాదాలు.

శారద

ప్రత్యుత్తరమిమ్ము