Posted by: sbmurali2007 on: నవంబరు 12, 2008
ఈ మధ్య ఒక చిన్న వినోదకరమైన సంఘటన జరిగింది. ఒకానొక ఆఫీసులో పని చేసే ఒక స్నేహితుడిని అతని కొలీగ్ మందలించాడట, ఆఫీసు కంప్యూటర్లో పోర్నోగ్రఫిక్ వెబ్ సైట్లు చూస్తున్నావా, అని. ఈ అబ్బాయి తెల్లబోయి, ఛీ చీ అలాటిదేమీ లేదే అన్నడట. తరువాత అతను తన పాత చరిత్రంతా తోడుకుంటే కనబడ్డ సైట్లు ఇవీ !
http://www.telugupeople.com/home/index.aspx
http://www.andhrabhoomi.net/vennela.html
Naturally, he stopped reading telugu news papers online after that
.
తెలుగు సినిమాల్లో స్త్రీలు, ప్రత్యేకించి హీరోయిన్లు వేస్కునే బట్టలు చూసి అందరికీ నాలాగే కంపరం, వెగటూ, రోతా పుడుతున్నాయా, లేక నాలోనే ఏదైనా లోపం వుందా?
I have some questions regarding this issue. Any discussion/exchange of opinions, enlightenement is welcome.
1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
5.Where does creative expression end and pornography begin?
ఆ సినిమాలు చూడటం మానేయొచ్చు కదా, అన్న సొల్యూషన్ నాకు తెలుసు. Is there any other way of fighting these indecent creatures?
ఈ మధ్య నా ఇంటర్నెట్ కేఫ్ లో రెగ్యులర్ కస్టమర్ ఒకతను బూతు బొమ్మలు చూస్తుండగా నేను ఇలాంటివి పర్మిట్ చెయ్యను అని అతనితో అన్నాను. అవి బూతు బొమ్మలు కావు, సినిమా హీరోయిన్ చార్మీ ఫోటోలు అని సమాధానం చెప్పాడు. అవి చార్మీ ఫోటోలే కానీ అవి అచ్చం సెక్స్ వెబ్ సైట్స్ లోని బొమ్మలు లాగ ఉన్నాయి. మన సినిమా హీరోయిన్ల్య్ పార్నో మోడెల్స్ స్థాయికి దిగజారిపోయారని అర్థమయ్యింది.
శారదగారూ నేనుకూడా మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ కూడా వివిధ సంఘాలద్వారా ఈ విషయం ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు విన్నవించబడుతూనే వుంది. కానీ ఈ పోటీ ప్రపంచంలో ఆధునికత పేరుమీద సినిమా తరువాత సినిమా కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా నిర్మాతలు కానీ దర్శకులుగానీ ముఖ్యంగా తెలుగుదనానికి ప్రాముఖ్యతనిచ్చే సినిమాలు తీస్తే మళ్ళీ మిగతావాళ్ళూ వాళ్ళను అనుసరించగలరని ఆశించగలం.
Goodluck
నాకు డి.టి.పి. కం ఇంతర్నెట్ కేఫ్ ఉంది. ఒక సారి ఒక స్కూల్ స్టూడెంట్ నా కేఫ్లో సెక్స్ వెబ్ సైట్లు చూస్తుంటే నేను అతన్ని బయటకి గెంటేశాను. ఇంటర్నెట్ కేఫ్ ఓనర్లు చెయ్యదలచుకుంటే ప్రాక్సీ సర్వర్లు కూడా ఉపయోగించి సెక్స్ వెబ్ సైట్స్ ని బ్లాక్ చెయ్యొచ్చు. కానీ సినిమా హీరోయిన్ల బొమ్మలు ఉన్న వెబ్ సైట్స్ ని కూడా బ్లాక్ చెయ్యడానికి ఎంత మంది ఒప్పుకుంటారో తెలియదు.
మసాలా అనే పదం వంటల వెబ్ సైట్స్ లోనూ వాడుతారు, సెక్స్ వెబ్ సైట్స్ లోనూ వాడుతారు. బూతు కాని పదాలని కూడా బూతులుగా మార్చే టాలెంట్ సెక్స్ వెబ్ సైట్స్ వీక్షకులకి ఉంది.
ఇంటర్నెట్ పార్నోగ్రఫీకి వ్యతిరేకంగా నేను కొత్త బ్లాగ్ తెరిచాను. దాని అడ్రెస్ http://netizen.pkmct.net ఈ మధ్య నా ఇంటర్నెట్ కేఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఆ బ్లాగ్ తెరిచేలా ప్రభావితం చేసింది. http://telugu-blog.pkmct.net/2009/04/blog-post_05.html
పబ్లిక్ ప్లేసెస్ లో సెక్స్ గురించి మాట్లాడితే పరువు పోతుందనుకుంటారు. అలా అనుకునే వాళ్ళే ఇంటిలో టి.వి. వేసుకుని బూతు డాన్సులు చూస్తుంటారు. నీతి అనేది కేవలం పబ్లిక్ లో పరువులో ప్రతిష్టలు ప్రదర్శించుకోవడానికేనా? వ్యక్తిగత జీవితంలో కూడా నీతిని ఆచరించాల్సిన అవసరం లేదా? నీతి పేరు చెప్పుకుంటూ నీతిలేని బతుకు బతకడం చూస్తోంటే నాకు నిజంగా అసహ్యం కలుగుతోంది.
అరుంధతి సినిమాల గురించి వ్రాసిన ఆర్టికల్స్ పూర్తిగా చదవండి. ఆ సినిమా గురించి ఇచ్చిన హైప్ పబ్లిసిటీ చూసి పిల్లలు చూడడానికి కూడా బాగుంటుందనుకుని ఆ సినిమాకి పిల్లల్ని తీసుకెళ్ళిన వాళ్ళే ఎక్కువ. పిల్లలు ఆ సినిమా చూసి పీడ కలల బారిన పడతారని మాత్రం తీసుకెళ్ళిన వాళ్ళు ఊహించలేదు.
1. దీని ప్రభావం మనుషుల మీదా, సంఘం మీదా ఏమైనా వుంటుందా?
ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, ఈ ధోరణికూడా ఆ ప్రభావం వల్లనే అయ్యుండొచ్చుకదా! సినిమా మన దగ్గర ఒక అసంపూర్ణస్వప్నాల్ని అందిపుచ్చుకునే ఒక (చీకటి) ఊహాలోకం. ఆ లోకంలో అణగారిన కోరికలుంటాయి, అందుబాటులో లేకపోయినా ఆశపడే అందాలుంటాయ్,సాహసాలుంటాయి,అసంబద్ధ పోకడలుంటాయి. అంటే సమాజనికి అద్ధం సినిమాలైతే, సినిమా అద్ధాన్ని చూసి ఇమిటేట్ చేసేవారికీ తక్కువలేదు.
2.ఆడవాళ్ళు ఇలాటి వస్త్రధారణని అవమానంగా humilitation భావించటం సబబేనా, లేక over reaction అవుతుందా?
సినిమా హీరోయిన్ వృత్తి (హీరోతోపాటూ)ప్రేక్షకుడ్ని titillate చేసి రంజింపజెయ్యటం. దాన్నొక ప్రొఫెషన్ గా చూస్తే, వారు వేసుకునే దుస్తుల్ని చూసి బాధపడనవసరం లేదు. కానీ, మనకున్నది “విలువల దృష్టి”. ఇలా ఉంటే “తప్పు” అనే pre-conditioned ధృక్కోణం నుంచీ చూస్తే మనకు మిగిలేది humiliation, అయ్యేది over reaction.
3. ఇలాటి సినిమాలూ, ఉండీ లేనట్టున్న ఆ బట్టలూ చూస్తే, ఎవరికైనా, బహుశా అందరు మగవాళ్ళకూ voyeuristic taste వుంటుంది కాబోలు అనిపించదా? అప్పుడది మగవాళ్ళకి అవమానంగా అనిపించదా?
చాలా మంది మగవాళ్ళు సినిమాకి వెళ్ళేదే ఈ voyeuristic pleasure “కుతి”ని అనుభవించడానికి. తమ suppressed sexuality కి ఒక చీకటి outlet కోసం. మరి ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి ఏముంది? సినిమా ఒక గౌరవప్రదమైన దారాయె!
4.Is this a problem or just an annoyance? Is there anything anybody could do about this? Women’s organisations, thinkers, teachers?
మహిళా సంఘాలు ఎన్నోసార్లు ఈ “బూతు” సంస్కృతి మీద ధ్వజమెత్తి సినిమాహాళ్ళను ధ్వంసం చేశారు. అప్పటి నుండీ ఇప్పటి వరకూ ఈ ధోరణి సామాన్య ప్రజల్లో అంగీకారాత్మకం అయిపోవడంతో వీళ్ళకు చెయ్యడానికి ఏమీ మిగల్లేదు. ఇదొక విస్తృత సామాజిక ధోరణి దీనకి సమాధానం ‘ఎవరో ఒకరు’ వెతకడం కష్టం. సమిష్టిగా ఒక ప్రయత్నం జరగాలి. కానీ ఈ సమస్యను define చెయ్యడంలోనే చాలా సమస్యలున్నాయి. అందుకే బహుశా ఇంతవరకూ “ఇది చెయ్యాలి” అని చెప్పగలిగేవాళ్ళు లేరు. ఈ సందర్భంలో film studies లాంటి ఒక పరిశోధన చాలా అవసరం.
ఈ క్రింది లంకెలోని వ్యాసాన్ని ఒకసారి చూడండి
http://navatarangam.com/2008/08/telugu-sex-films/
5.Where does creative expression end and pornography begin?
Both are projected to be interrelated. Though they are actually not. Its saleability that is determining soft-pornographic aspects in mainstream Indian cinema, Telugu cinema in particular.
దీని మీదనెంత క్లుప్తంగా వీలయితే అంత క్లుప్తంగా నేను వ్రాస్తాను.
- అవును ఇది జుగుప్సాకరమే. ప్రత్యేకించి మీరు ఒక కోవకి చెందని వారైతే, ఆ కోవ ఏంటంటే, ఎంత వయస్సువచ్చినా కోఱికలు తీర్చుకోడానికి “సభ్య”మైన విధానం లేక సినిమాలను చూసి “సంతృప్తి” పడవలసిన దౌర్భాగ్యమున్న యువత. ఆ కోవకు మీరు చెందకుంటే ఇది పూర్తి జుగుప్సే.
- పైన ఉదహరించినట్టు, కొందరికి జుగుప్స అనిపించింది, కొందరు నిత్యం వృత్తి ధర్మంగా చేస్తూవుంటారు. ఉదా – ఒక గాంధేయవాదికి మనుషులను చంపడానికి వాడే పరికరాలను తయారుచేయడమంటే పరమజగుప్స వుంటుంది. కొందరికి అది జీవనాధారం, వారు “arms escalation మా పూచీ కాదు, మేము మా కర్మ నిర్వత్తిస్తున్నామంతే” అంటారు.
- కాబట్టి మనము సినిమా హీరోయిన్లనూ పని మానమనలేము, అలానే సైంటిష్టులనూ పని మానమనలేము.
- ఐతే ఏం చేయాలి? వెనకటికి ఎవరి ఇంట్లో వారు, ఎవరి చేలో వారు వుండేవారు, జుగుప్స కనబడడానికి ఆస్కారం వుండేది కాదు. ఈ రోజుల్లో అలా కాదు. ఉదయాన్నే పేపరు పేరిట మనం దాన్ని కొనుక్కుంటున్నాం (ఎంత జుగుప్సాకరమైన ఇంసెస్టయితే అంత పెద్ద అక్షరాలతో కనబడుతోంది). ఇక టీవీ పేరిట జగుప్సను ఆధరిస్తున్నాము పూజిస్తున్నాము.
చివరకు చెప్పేదేంటంటే, ఆ పుంతలు త్రొక్కవద్దు.
ఎక్కడ జుగుప్సాకరమైన సినిమా ప్రస్తావన వుంటుందో అటు వెళ్ళవద్దు.
(అటు మానేసి మా నవతరంగానికి రండి).
అలానే. వినియోగదారుతత్వం ఇష్టంలేకుంటే ఓ-సో-కూల్-బ్యాంకరుగా పని చేయవద్దు. అంతే!
నాకు కూడా జుగుప్స పెద్ద సమస్య. తగ్గించుకోవడానికి సకల విధాలా ప్రయత్నిస్తున్నాను. మీకు ఏమైనా మంచి పద్ధతులు తెలిస్తే మీ సహోదరునిగా భావించి, నాకునూ తెలుపగలరు.
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి ।
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ॥
రాకేశ్వర.
ఇప్పుడే కత్తి మహేష్ గారి బ్లాగ్ లో తెలుగు సినిమాలలో స్త్రీల వస్త్ర ధారణ అనే టపా చదివాను. http://parnashaala.blogspot.com/2009/05/blog-post_29.html ఈ టపాలో మహేష్ గారి అమాయకత్వం కనిపిస్తోంది. సినిమా వాళ్ళకి నిజాయితీ ఉంటుందని నమ్మితే అది నిజంగా అమాయకత్వమే. సినిమా ప్రొడ్యూసర్లు తమ భార్యలనో, కూతుళ్ళనో, కోడళ్ళనో పెట్టి సినిమాలు తియ్యరు, తియ్యలేరు. అలా తియ్యడం తమ కుటుంబ పరువుకి భంగం కలిగిస్తుందని కూడా భావిస్తారు. ఇది వాళ్ళ హిపోక్రిసీ యొక్క అసలు రంగు. చలం గారి సాహిత్యం చదివినా ఈ విషయం అర్థమైపోతుంది. పురుషాధిక్య సమాజంలో మగవాడు పరాయి ఆడదాన్ని మోహిస్తాడు కానీ తన భార్యని వేరేవాడు మోహిస్తే సహించలేడు. మగవాడు ఆడదాన్ని ప్రైవేట్ ఆస్తిని చూసినట్టు చూస్తున్నాడని చలం గారు గ్రహించారు కానీ చలం సాహిత్యం చదివినట్టు చెప్పుకున్న మహేష్ ఈ విషయం గ్రహించలేకపోవడం విచిత్రంగా ఉంది. సినిమా వాళ్ళకి నిజాయితీ ఉంటుందని నమ్మడం ఎందుకు జోక్ అవుతుందో రంగనాయకమ్మ గారు కూడా “మానవ సమాజం” పుస్తకంలో వివరంగా వ్రాసారు, చదవండి.
ఈ లింక్ కూడా వీక్షించండి: http://telugu.stalin-mao.net/2009/05/24/437
>>”ఆ సినిమాలు చూడటం మానేయొచ్చు కదా, అన్న సొల్యూషన్ నాకు తెలుసు. Is there any other way of fighting these indecent creatures?”
హీరోయిన్ల ఒళ్ళు ప్రదర్శనలకు ప్రజలు ఎగబడుతుంటే దాదాపు ప్రతీ సినిమా హిట్టు కావాలి. మన తెలుగు ఇండస్ట్రీలో హిట్టు సినిమాలు సంవత్సరానికి పదికి మించవు. కాబట్టి కేవలం హీరోయిన్ల ఒళ్ళు ప్రదర్శనలతో హిట్టయిన సినిమా నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు. ప్రజలు ఇంత డైరెక్టుగా చెబుతున్నా ఎందుకనో దర్శక, నిర్మాతలు మళ్ళీ అదే విధంగా తీస్తుంటారు.
కాని ఒక్క విషయం, ఈ హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ విషయంలో నాకు తెలుగు సినిమాలంటే కొద్ది పాటి గౌరవం ఉంది. ఎందుకంటే, హాలీవుడ్డు, బాలివుడ్డు, కోలివుడ్డు ఇలా అన్నిరకాల ఉడ్డులతో పోలిస్తే, మన సినిమాల్లోని హీరోయిన్ల బట్టలు చాలా చాలా మెరుగు. అలాగే మన వాళ్ళు కొద్ది పాటి హద్దుల్లో ఉంటారు.
శృంగారం, హింస వున్నా కూడా మనవాళ్ళు హాస్యానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అందువల్ల కూడా తెలుగు సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం.
ఒకవేళ జనం బూతు సినిమాలు మాత్రమే చూసే రకమైతే శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? అది కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడే రోజుల్లో?
1970లలో జయమాలినీ, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడుతున్న రోజులలో కూడా బూతు లేని శంకరాభరణం సినిమా హిట్ అయ్యింది. బూతు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయనుకుంటే అది భ్రమే. జనం వేరే సినిమాలు దొరక్క జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు చూసి ఉండొచ్చు. అందుకే ఆ సినిమాలు హిట్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ముమైత్ ఖాన్ సినిమాలలో జ్యోతిలక్ష్మి సినిమాల కంటే ఎక్కువ బూతు కనిపిస్తోంది. అయినా ముమైత్ ఖాన్ సినిమాలు ఎక్కువగా హిట్ అవ్వడం లేదు.
@రాకేశ్వర్; బాగా చెప్పారు. కొంచెం ఇలాంటిదే నేనూ శారదగారికి చెప్పడానికి ప్రయత్నించాను. కాకపోతే దానిలో ignore చెయ్యడంతో పాటూ affirmative action యొక్క సూచన ఉంది అంతే!
@శారద: “పుట్టించుకుని” అనే పదప్రయోగం అసంకల్పితంగా చేసినా ఇప్పుడు అర్థవంతంగానే అనిపిస్తోంది.
Pavlovian classical conditioning theory ప్రకారం మన response యొక్క నెపం stimulus మీదపెడితే సరిపోదు. మనదైన conditioning చేసుకుని ఆ రెస్పాన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మీ కంపరం, వెగటూ, రోతలకు కారణం మీరేతప్ప మీరు చెప్పిన కారణాలు కాదు.
ఇక టీనేజర్స్ మీద పరిణామాల గురించి చర్చించడానికి కొంచెం social conditioning కొద్దాం. “విలువలు” అనేవి సామాజికం.అత్యంత పురానం. అలాంటి వాటిని సినిమాలాంటి ఒక పాప్యులర్ కల్చర్ ‘సమూలంగా’ మార్చగలుగుతోందంటే సమస్య అనుకున్నంత సులువైనది కాదు అని చెప్పుకోవాలి.
కానీ ఆసమస్యకుతగ్గ శోధన,పరిశోధన జరగటం లేదనేది సుస్పష్టం. అందుకే సమస్యని define చెయ్యడంలో చాలా సమస్యలున్నాయని నేనన్నాను. మనం కంటి ముందుకనిపించే నిజాల్ని objective గా చూడకుండా విలువల prism లోంచీచూడ్డంకూడా ఈ సమస్య మరింత తీవ్రమవ్వడానికి కారణభూతాలవుతున్నాయి.
స్టీరియోటైపింగ్ అనేది ఒక recognizable identity సృష్టించడంలో జరిగే ప్రయత్నం. మగాళ్ళందరూ వీటిని అంగీకరించనఖ్ఖరలేదు. ఆడావాళ్ళందరూ ఈ ఆలోచనకు confine అవనక్కరాలేదు. కానీ ఇలాంటి స్టీరియోటైపింగ్ ఉంది. అనే నిజాన్ని అంగీకరిస్తే చాలు.సమస్యకు సమాధానం దిశగా రెండడుగులు వేసినట్లే. కానీ కొందరు “మర్యాదస్తుల” కారణంగా అదికూడా జరగడం లేదు అనేది నా అభియోగం.
రాంగోపాల్ వర్మ మేధావితనానికి సరితూగే మహిళా మేధావి శోభాడే ని కూడా చదవండి. రెండువైపుల్నుంచీ ఎంత దారుణమైన వాదాలు వినిపిస్తాయో!చాలా ఆసక్తికరంగా ఉంటాయి.
I don’t cry foul, because my intention is same as yours. But, my approach is different thats’ all.
శారదగారూ, ఇలా మన మధ్య చర్చలు ఇది రెండోసారి. ఎందుకో చెప్పలనిపించింది.
నేను వ్రాసినది మళ్ళీ చదవండి
>>>ఒకవేళ జనం బూతు సినిమాలు మాత్రమే చూసే రకమైతే శంకరాభరణం లాంటి సినిమాలు ఎలా హిట్ అయ్యాయి? అది కూడా జయమాలిని, జ్యోతిలక్ష్మిల సినిమాలు ఆడే రోజుల్లో?>>>
సినిమాలలో బూతు లేకపోయినా హిట్ అవుతాయి. ఈ విషయం తెలిసి కూడా బూతు సినిమాలు మాత్రమే హిట్ అవుతాయని భ్రమ పడడం ఎందుకు?
శారద గారు,
మీరు మగవారికి చిరాకు రాదా అని అడుగుతున్నారా?
దాని జవాబు చాలా సరళం. నీచమైన ప్రవర్తన చూస్తే ఎవరికైనా చిరాకే వేస్తుంది (కనీసం ఆలోచించే ఎవరికైనా). బైకు ప్రకటనల నుండి టీవి ప్రకటనల వఱకూ ప్రతి దానిలోనూ అర్థనగ్న ఆడవారిని చూపించిడం నీచమైన పని అని ఎవరైనా ఒప్పుకుంటారు.
*ఇందులో పురుష స్త్రీ బేధాలు లేవు*
బాబా రామదేవ్ అన్నారు, “యువకులూ మీ ఇంట్లో, ఎవరో అక్క ఫోటోనో, ఎవరో అమ్మ ఫోటోనో పెట్టుకోవద్దు, భగవంతును ఫోటో పెట్టుకోండని”. ఎంత మెత్తగా చెప్పాడు మహానుభావుఁడు అనిపించింది.
అలాగని అందమైన అమ్మాయిలు చూపిస్తే మగవారందఱూ కళ్ళు మూసుకుంటారా అంటే, అబ్బే లేదు. మనుషులు ఎదిగిన జంతువులు. మగసింహాలూ, మగనీటేనుగులు, మగనాగుపాములూ అయితే బాలింతరాళ్ళతో సంభోగించడానికై వారి పసి పిల్లలను చంపేస్తాయి. అది సృష్టిలోఁ ‘మగ’ విధానం. చూడలనేది ”మగ’ మానుష్య బలహీనత.
ఇక స్త్రీలకు కూడా నలుగురు మగవారిని తమవైపు ఆకట్టుకోవాలనే తపన కూడా వుంటుంది. లీమర్లలో, పొట్టేళ్ళలో నలుగురు మగవాళ్ళు వచ్చి పోటీపడితే ఎవరు నగ్గితే వాళ్ళతో ఆమె జతకడుతుంది. ఇది వారి బలహీనత. (మంచి జన్యువులు తరువాతి తరాలకు సంక్రమించడం వుద్ధేశ్యమని మనం సర్ది చెప్పుకోవచ్చు.)
మొత్తానికిలా మనుషుల బలహీనతలను సొమ్ము చేసుకుంటుంది కాబట్టి, ఆ విషయం తెలిసిన మనకు అది జుగుప్సాకరమైన పని అనిపిస్తుంది. After all, art is supposed to appeal to the positive aspect of humanity.
ఏదైమైనాగానీ మనలో పుట్టిన జగుప్స మనకే నష్టం కలిసిస్తుందిగా?
ఇక ఈ ప్రవృత్తిని మార్చడానికి ఉపాయాల విషయమై, నాకైతే ఎటువంటి ఆశా లేదు. వీటి వెనుక గల కారణాలు చాలా బలమైనవి గనుక. మనము చేయగలిగినదల్లా వాటిలో సాధ్యమైనంత తక్కువ పాలుపంచుకోవడం.
- రాకేశ్వర
ఇంకొక లంకె
బూతు అనే పదానికి స్పష్టమైన డెఫినిషన్ ఉంది. ప్రైవేట్ గా చేస్తే శృంగారం, పబ్లిక్ గా ప్రదర్శిస్తే బూతు. ఈ లాజిక్ ప్రకారం బూతు పత్రికలు, బూతు బ్లాగులు జనం మీదకి వదలడం కూడా నేరమే.
ఒక సారి రష్యాలో లెనిన్ ఇతర విప్లవకారులతో కలిసి సరోవరం పక్కన రెస్ట్ తీసుకుంటోంటే పడవ మీద వెళ్తోన్న యాత్రికులు పాడుతోన్న బూతు పాట వినిపించింది. విప్లవకారులందరూ ఆ పాటని అసహ్యించుకున్నారు. ఒకవేళ అసహ్యించుకోకపోతే లెనిన్ ఏమనుకునేవాడంటే “ఇలాంటి నీతిలేని వాళ్ళతో కలిసా నేను కొత్త సమాజాన్ని నిర్మించేది?” అని.
జనం అందరూ నీతిలేని వాళ్ళు అనుకోను. సమాజంలో నీతి ఇంకా బతికి ఉంది కాబట్టే బూతు లేని సౌందర్య సినిమాలు హిట్ అయ్యాయి. నాకు సౌందర్య గారు అంటే ఎంతో గౌరవం కానీ ఆమె చనిపోవడం విషాదాన్ని తలపింప చేసింది.
డిసెంబరు 1, 2008 వద్ద 9:41 పూర్వాహ్నం
You are 100% correct.
Not only many people are there to oppose this trend, but not expressing. we need active participation from youth.
I would like to share my feelings at following address
http://manaanubhoothulu.blogspot.com/2008/11/blog-post_30.html